జై చిరంజీవ !!

13680634_1206649096020815_5835392668772864219_n

ఆయన …

స్వయంకృషితో కళాశిఖరాన్ని అధిరోహించిన నిత్య శ్రామికుడు…
అభినయ సామ్రాజ్య చక్రవర్తి…
అకుంఠిత దీక్ష. అంకితభావం ఉంటే సామాన్యుడే అసామాన్యుడవుతాడని నిరూపించిన ఆయన… తెర వెనుక కొణిదల శివశంకర వరప్రసాద్…
వెండితెర మీద చిరంజీవి…
సినిమాకు ఓ కొత్త రూపు, కొత్త చూపు, కొత్త జవం, కొత్త జీవం అన్నిటా కొత్తదనాన్ని సంతరింపజేసిన ఆ సం’చలన’ తరంగం అసలు పేరు ‘మెగాస్టార్’!

1977లో సినిమా రంగం వైపు అడుగులు వేశాడు..
1987లో ‘పసివాడి ప్రాణం’ సినిమాతో ‘నెంబర్ వన్’ అయ్యాడు..
1997లో ‘హిట్లర్’గా తన సినిమా ప్రయాణంలో రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టాడు..
2007లో ‘శంకర్ దాదా జిందాబాద్’ తర్వాత సినిమారంగం నుంచి రాజకీయాల్లోకి వెళ్ళాడు..
2017లో మళ్ళీ హీరోగా పూర్తి స్థాయిలో సినిమాల్లో నటించటానికి తిరిగి వస్తున్నాడు..

ఈ ప్రయాణంలోని ఆయన సినిమాల సమాహారమే ఈ ‘పునాదిరాళ్ళు‘ …

– రావూరి